Tollywood : ఊర మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో క్లాస్ హీరో.. హిట్ దక్కుతుందంటారా..?
- యావరేజ్ టాక్ తెచుకున్న శర్వానంద్ మనమే
- మూడేళ్ళుగా సినిమా చేయని దర్శకుడు సంపత్ నంది
- ప్రస్తుతం రెండు సినిమాలతో శర్వా బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ‘మనమే’ చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు. ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు, ఆశలు పెంచుకున్నాడు శర్వా. కాని ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. చాలా కాలంగా హిట్ లేని శర్వానంద్ కు ‘మనమే’ నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి..
Also Read: Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..?
Also Read
కాగా శర్వా ఎలాగైనా మళ్లి ఎక్స్ ప్రెస్ రాజా,శతమానంభవతి రేంజ్ హిట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దశలో పలు కథలు వింటున్నాడు. ఈ ప్రాసెస్ లో మాస్ డైరక్టర్ సంపత్ నంది చెప్పిన కథకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. సంపత్ నంది లాస్ట్ హిట్ గోపిచంద్ కలయికలో వచ్చిన సిటీమార్. 2021లో వచ్చిన ఈ సినిమా తర్వాత సంపత్ నుండి సినిమా రాలేదు. శర్వా కోసం పవర్ఫుల్ కథ రెడీ చేసాడని ఈ చిత్రంతో ఈ కుర్ర హీరో బౌన్స్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని సమాచారం. శర్వా,సంపత్ ల చిత్రాన్నీ భారీ బడ్జెట్ పై సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె రాధామోహన్ నిర్మించనున్నారు. త్వరలో ఇందుకు సంభందించి అధికార ప్రకటన రానుంది. మరోవైపు శర్వా చివరి సినిమా మనమే రిలీజై కొన్ని నెలలు కావోస్తున్న ఇంతవరకు ఓటీటీ స్ట్రీమింగ్ కాలేదు. దీనిపై నిర్మాణ సంస్ధ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఓటీటీలో ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!