Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..?
- పూరి జగన్నాధ్ మెడకు లైగర్ తలనొప్పులు
- రంగంలోకి నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్
- వరంగల్ శ్రీను వ్యవహారం సెటిల్ చేసేందుకు సునీల్ అంగీకారం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరి జగన్నాథ్ తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. రామ్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ చిత్రం నైజాం పంచాయితీ ఇంకా ఎటూ తేలలేదు. కారణం పూరి గత చిత్రం లైగర్. విజయ్ దేవర కొండా హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను భారీ ధర వెచ్చించి నైజాం రైట్స్ కొనుగోలు చేసాడు వరంగల్ శ్రీను. లైగర్ ఫ్లాప్ తో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. తమకు నష్ట పరిహారం చెల్లించకుండా నైజాంలో డబుల్ ఇస్మార్ట్ విడుదలను నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. కొందరు ఈ విడుదలను బహిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నారు.
Also Read: Tollywood: టాలీవుడ్ సూపర్ ఫ్లాష్ అప్‌డేట్స్.. ఒక్క క్లిక్ లోనే..
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
దీంతో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డైలమాలో పడింది. ఇటీవల ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం భేటీల మీద భేటీలు జరిగాయి కానీ ఎటు తేలలేదు. ఫైనల్ గా ఈ వ్యవ్యరంలోకి నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ మరియు నిర్మాత ఏషియన్ సునీల్ రంగంలోకి దిగారు. లైగర్ ను కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుకు అలాగే ఎగ్జిబిటర్లకు ఏషియన్ సునీల్ కొంత మొత్తం నష్టపరిహారం చెల్లించి, ఏషియన్ సునీల్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ ఓ సినిమా చేసేలా ఒప్పందం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు ఇరు పక్షాలు అంగీకరించారని సమాచారం అందుతోంది. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నిరంజన్ రెడ్డి రూ. 60 కోట్లకు కొనుగోలు చేసారు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డబుల్ ఇస్మార్ట్.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!