AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా 18 జిల్లాల్లో మొత్తం 44 ఘటనలు నమోదైనట్లు తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని పేర్కొన్నారు.
46,380 మంది పోలీసులతో భారీ బందోబస్తు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల భద్రత కోసం మొత్తం 46,380 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు డీజీపీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామని, అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించి నిరంతర నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు వివరించారు.
Also Read
- YS Jagan: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై రాజకీయ రగడ.. వాస్తవాలు వెల్లడించిన జగన్..
- Pawan Kalyan: సామాన్య ఓటర్లతో కలిసి ఓటేసిన పవన్ కళ్యాణ్.. ప్రజలకు కీలక సందేశం
- CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
- CM Chandrababu : ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు.. ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపు
18 జిల్లాల్లో 44 ఘటనలు నమోదు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 18 జిల్లాల్లో మొత్తం 44 ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఘటనల్లో పాల్గొన్న నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం
ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు డీజీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం కూడా ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
-
Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్
-
Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
-
December Rule Changes: డిసెంబర్ 1 నుంచి మారబోతున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ కార్డుల బాదుడు నుంచి ఆధార్ ఫ్రీ అప్డేట్ వరకు!
-
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!