Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా వెల్లడిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “బీజేపీ కుటుంబంలో అధికారికంగా చేరడం నాకు ఎంతో ప్రత్యేకమైన మరియు భావోద్వేగ క్షణం. ప్రధాని నరేంద్ర మోదీ గారి విజన్, లీడర్షిప్ను నేను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటాను. పార్టీ మద్దతుదారుగా ఉంటూ, ఇప్పుడు ఈ పెద్ద కుటుంబంలో భాగమవ్వడం ఎంతో గర్వంగా ఉంది.” అని ఆమె రాసుకొచ్చారు.
తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన సీనియర్ బీజేపీ నాయకులు రామచంద్రరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పూర్తి నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. “ఇది కేవలం సభ్యత్వం మాత్రమే కాదు.. ఒక కొత్త బాధ్యత. నాకున్న సామర్థ్యంతో సమాజానికి సేవ చేస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే నా లక్ష్యం.” అని అన్నారు. తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ, రాజకీయాల్లో ప్రారంభించిన ఈ సరికొత్త ప్రయాణంలో కూడా అందరి ఆశీస్సులు, మద్దతు కావాలని ఆమె కోరారు.
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?