Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Bachelors: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అనలేదు. ఆ మధురమైన ముచ్చట్లలో పెళ్లి ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ మన టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ మాత్రం ఈ మాటను బొత్తిగా మర్చిపోయినట్లున్నారు. ‘సోలో లైఫే సో బెటర్’ అంటూ ఎవరికి వారు తమ కెరీర్లతో, పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తున్నారు తప్ప, ఇంట్లో భాజా భజంత్రీలు మోగించే ఆలోచన మాత్రం చేయడం లేదు. నిజానికి ఈ ఏడాది టాలీవుడ్లో పెళ్లి సందడి కాస్త తక్కువగానే కనిపించింది. విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రిన్స్ వంటి హీరోలు ఎట్టకేలకు ఓ ఇంటివారై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వీరి బాటలోనే మెగా హీరో సాయి తేజ్, అలాగే యంగ్ హీరో తేజా సజ్జా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ముప్పై ఏళ్లలోకి అడుగుపెట్టగానే యంగ్ బాయ్ తేజా సజ్జా పెళ్లికి రెడీ అయిపోతుంటే, 35 దాటి, 40 క్రాస్ అయిన సీనియర్ బ్యాచ్లర్స్ మాత్రం ఇంకా సింగిల్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పెళ్లి కాని ప్రసాదుల జాబితాలో అందరికంటే ముందుగా వినిపించే పేరు మన డార్లింగ్ ప్రభాస్. నలభై ఐదేళ్లు దాటిన ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లి కోసం అటు కృష్ణంరాజు కుటుంబంతో పాటు కోట్లాది మంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు కానీ, ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసెత్తడం లేదు. స్వయంగా పెద్దమ్మ శ్యామలా దేవి ఎన్నోసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా సున్నితంగా దాటవేస్తున్నారు. అటు సోదరీమణులు కూడా సమయం వచ్చినప్పుడు చేసుకుంటాడంటూ కవర్ చేస్తున్నారు తప్ప, అసలు విషయం చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న భారీ సినిమాల లైనప్ చూస్తుంటే, ఇప్పట్లో ఆయనకు పెళ్లి చేసుకునే తీరిక ఉందా అనే అనుమానం కలుగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా డార్లింగ్ ఈ తీపి కబురు చెబుతాడో లేదో చూడాలి.
Also Read
- Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
- Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్... వైరల్ అవుతున్న చెక్!
- Alias Rukmini రిలీజ్‌కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
- Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
మరోవైపు అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన నాగార్జున మేనల్లుడు సుశాంత్ కూడా నలభైల్లోకి అడుగుపెట్టేశాడు. కెరీర్ పరంగా ఇంకా సరైన బ్రేక్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్న సుశాంత్, పెళ్లి విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. కజిన్స్ నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని తమ జీవితాల్లో సెటిల్ అవ్వడమే కాకుండా కెరీర్ పరంగానూ హిట్లు అందుకుంటున్నారు. కనీసం వారిని స్ఫూర్తిగా తీసుకునైనా సుశాంత్ పెళ్లి పీటలు ఎక్కుతాడని ఫ్యాన్స్ ఆశించారు. మధ్యలో హీరోయిన్ మీనాక్షి చౌదరితో సుశాంత్ ప్రేమలో ఉన్నాడంటూ జోరుగా ప్రచారం జరిగినా, అవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది.
ఇక ఇదే 35 ప్లస్ క్లబ్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, టాలెంటెడ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ కూడా ఉన్నారు. ముప్పై ఐదేళ్లు దాటిన రామ్ పోతినేని తన ఎనర్జీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఇంకా సింగిల్ స్టేటస్‌నే మెయింటైన్ చేస్తున్నాడు. అటు వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న అడివి శేష్, వరుస సినిమాలతో బిజీగా ఉన్న సందీప్ కిషన్ కూడా తమ పూర్తి ఫోకస్ అంతా కెరీర్‌పైనే పెట్టారు. వీరికి అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అర్థం కావడం లేదు. వీరితో పాటు యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి కూడా బ్యాచ్‌లర్ లైఫ్‌కే ఓటేస్తున్నారు. ఒకవైపు సాయి తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుండటంతో, మెగా కాంపౌండ్‌లోని మరో కుర్ర హీరో వైష్ణవ్ తేజ్ వంతు ఎప్పుడొస్తుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తం మీద టాలీవుడ్లో పెరుగుతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్ ఎప్పుడు తగ్గుతుందో, ఈ హీరోలంతా అభిమానులకు ఎప్పుడు పప్పన్నం పెడతారో కాలమే సమాధానం చెప్పాలి.
తాజావార్తలు
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్‌సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
-
Koti Deepotsavam 2026: నేడు కన్నులపండుగగా జరగనున్న కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..! గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన..
-
Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!