ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఓ సినిమా రూపొందుతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత, యువ మరియు ప్రతిభావంతుడైన దర్శకుడు మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ పోతినేని కెరీర్‌లో ఇది 22వ
చిత్రం.
CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా, ఈ కొت్త సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. రామ్‌తో జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సాంకేతిక బృందం వివరాలు ఇలా ఉన్నాయి:ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని, సంగీతం: వివేక్ – మెర్విన్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: మహేష్ బాబు పి.