సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ‘SSMB 29’ పేరుతో సంబోధిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ షూట్ పూర్తయింది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ అవుతూ వచ్చాయి. అయితే, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ సినిమా కోసం మహేష్ బాబు మొన్నటివరకు చేయని ఒక ఫీట్ చేసినట్లుగా తెలుస్తోంది.
Read More: Nayanathara : నయనతారను కలిసేందుకు వెళ్లిన అనిల్ రావిపూడి
అదేంటంటే, ఈ సినిమాలో ఆయన చొక్కా లేకుండా ఒక స్టంట్ యాక్షన్ సీక్వెన్స్ చేశారట. సాధారణంగా మహేష్ బాబుకి మంచి జిమ్ బాడీ ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువగా షర్ట్ లేకుండా కనిపించే సీన్స్‌ను గత సినిమాల్లో అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఎన్నో సినిమాల కోసం ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఆయనను ఎంత బలవంతం చేసినా, అందుకు ఆయన నిరాకరిస్తూ వచ్చారు. కానీ, రాజమౌళి సినిమాలో సీన్ డిమాండ్ చేయడంతో వెంటనే మహేష్ బాబు, ఇప్పటివరకు తాను చేయని షర్ట్‌లెస్ యాక్షన్ సీన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి టీం సమర్పణలో ఉంది. జూన్‌లో మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.