సౌత్, నార్త్ లో ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ ఫైట్ జరగలేదు. అప్పుడెప్పుడో డంకీ, సలార్ చిత్రాలు దెబ్బలాడుకున్నాయి. రెండు గెలిచినా పై చేయి సాధించాడు డార్లింగ్ ప్రభాస్. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేశాడు సలారోడు. ఇదిగో మళ్లీ ఏడాదిన్నర తర్వాత అలాంటి బిగ్గెస్ట్ స్టార్ వార్ ఆగస్టు 14న జరగబోతుంది. రెండు మల్టీస్టారర్ మూవీస్ వార్‌కు దిగబోతున్నాయి. ఇందులో ప్రమోషన్లలో కాస్త అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉంది కూలీ. ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ ను పెంచితే హైదరాబాద్‌లో ఈ నెల 22న నెక్ట్స్ సాంగ్ రిలీజ్ చేయబోతుంది టీం.
Also Read : Tollywood : ఆ సినిమా ఇన్ సైడ్ టాక్ బాగుందట
కూలీతో బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది వార్ 2. కానీ ప్రమోషన్లలో మాత్రం దానితో వెనకబడింది. జస్ట్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ తుస్సుమంటున్నాయి ఇలాంటి ప్రయోగాలు. జనాలు సూపర్ ఎగ్జెట్‌గా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రమోషన్లలో ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదు యశ్ రాజ్ ఫిల్మ్స్. అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టేసిన టీం ఈ వీకెండ్ లేదా నెక్ట్స్ వీక్ నుండి ప్రమోషన్లను స్టార్ట్ చేయనుందట. ట్రైలర్ లేదా సాంగ్ రిలీజ్ చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ కూడా రంగంలోకి దిగుతున్నారట. అయితే కలిసి కాదని సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను గ్రీక్ గాడ్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. ఏదైమైనా వార్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వాల్సిందే. మరి ఈ రెండు సినిమాలో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.