Site icon NTV Telugu

Tollywood 2025 : ఈ ఏడాదిలో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే

Tollywood

Tollywood

పవన్ కళ్యాణ్ తెరపై రెండేళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్‌కు పూనకాలే కాదు భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురు చూసిన వాళ్ల ఎక్స్పెక్టేషన్స్‌పై దెబ్బేసింది హరి హర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు విత్ ఇన్ టూ మంత్స్‌లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్.. తన కెరీర్‌లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు..ఈ ఏడాది టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓజీని నిలిపాడు పవన్.

Also Read : Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..

తన పేరులోని మొదటి అక్షరాన్ని సినిమాలకు పెట్టుకుని హిట్స్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత ఏడాది కతో ట్రాక్ ఎక్కిన కిరణ్.. ఈ ఏడాది వచ్చిన దిల్రుబాతో డిజాస్టర్ చూశాడు. మళ్లీ కె సెంటిమెంట్‌నే నమ్ముకుని వచ్చిన కె ర్యాంప్‌తో గట్టెక్కేశాడు ఈ రాయలసీమ కుర్రాడు. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో భైరవం ఫ్లాప్ చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా సెకండాఫ్‌లో వచ్చిన కిష్కింధపురితో లెక్కలు సరిచేయడమే కాదు.. ఆరేళ్ల పాటు గాడి తప్పిన కెరీర్‌ను పట్టాలెక్కించాడు.

ఏడేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్‌గా సక్సెస్ అయ్యాడు. భైరవం ఫ్లాప్ అయినా .. మిరాయ్‌తో డాడీ మార్క్ విలనీజాన్ని చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు మనోజ్. శంభాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఈ ఏడాది షణ్ముఖ్‌తో ఫ్లాప్స్ నుండి గట్టెక్కడమే కాదు.. పుష్కరకాలం తర్వాత ఓ మాసివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రిగుణ్ కూడా జిగేల్ అనే మూవీతో మెరుపులు చూపించలేకపోయినా.. ఈషాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ చూడగలిగాడు. మొత్తానికి ఈ హీరోలందరు.. 2025లో ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్నప్పటికీ.. సెకండ్ మూవీతో హిట్స్ అందుకుని.. హ్యాపీనెస్‌తో 2026లోకి అడుగు పెడుతున్నారు.

Exit mobile version