Tollywood 2025 : ఈ ఏడాదిలో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ తెరపై రెండేళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్‌కు పూనకాలే కాదు భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురు చూసిన వాళ్ల ఎక్స్పెక్టేషన్స్‌పై దెబ్బేసింది హరి హర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు విత్ ఇన్ టూ మంత్స్‌లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్.. తన కెరీర్‌లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు..ఈ ఏడాది టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓజీని నిలిపాడు పవన్.
Also Read : Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..
Also Read
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
- Raaka : 'రాకా'లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
- Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
- Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
తన పేరులోని మొదటి అక్షరాన్ని సినిమాలకు పెట్టుకుని హిట్స్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత ఏడాది కతో ట్రాక్ ఎక్కిన కిరణ్.. ఈ ఏడాది వచ్చిన దిల్రుబాతో డిజాస్టర్ చూశాడు. మళ్లీ కె సెంటిమెంట్‌నే నమ్ముకుని వచ్చిన కె ర్యాంప్‌తో గట్టెక్కేశాడు ఈ రాయలసీమ కుర్రాడు. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో భైరవం ఫ్లాప్ చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా సెకండాఫ్‌లో వచ్చిన కిష్కింధపురితో లెక్కలు సరిచేయడమే కాదు.. ఆరేళ్ల పాటు గాడి తప్పిన కెరీర్‌ను పట్టాలెక్కించాడు.
ఏడేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ తీసుకున్న మంచు మనోజ్ హీరోగా కన్నా విలన్‌గా సక్సెస్ అయ్యాడు. భైరవం ఫ్లాప్ అయినా .. మిరాయ్‌తో డాడీ మార్క్ విలనీజాన్ని చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు మనోజ్. శంభాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఆది సాయి కుమార్ ఈ ఏడాది షణ్ముఖ్‌తో ఫ్లాప్స్ నుండి గట్టెక్కడమే కాదు.. పుష్కరకాలం తర్వాత ఓ మాసివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రిగుణ్ కూడా జిగేల్ అనే మూవీతో మెరుపులు చూపించలేకపోయినా.. ఈషాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ చూడగలిగాడు. మొత్తానికి ఈ హీరోలందరు.. 2025లో ఫస్ట్ సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్నప్పటికీ.. సెకండ్ మూవీతో హిట్స్ అందుకుని.. హ్యాపీనెస్‌తో 2026లోకి అడుగు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!