తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి. పొంగల్ కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజ తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఉన్నారు.
ఈ సారి పోటీని మొదలుపెట్టేందుకు అందరికంటే ముందుగా వస్తున్నాడు విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న జానాయకుడు పొంగల్ కానుకగా జనవరి 9న వస్తోంది. హిట్ టాక్ వస్తే తెలుగులో భారీ కలెక్షన్స్ వస్తాయని గతంలో ప్రూఫ్ అయింది. ఇక మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న mega 157 సంక్రాంతికి రానుంది. అలాగే మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ నటిస్తున్న రాజసాబ్ కూడా పొంగల్ కి రిలీజ్ అవుతోంది. ఇక పొంగల్ బరిలో ఉన్న మరొక హీరో మాస్ మహారాజ్ రవితేజ. కిషర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న RT76 సినిమా సంక్రాంతికే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ వారి అనగనగ ఒక రాజు పొంగల్ బరిలోఉన్నాడు. ఈ సినిమాలు చాలవన్నట్టు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ ఆవుతోంది. స్టార్ హీరోల సినిమాల మధ్యలో శర్వా రావడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా బాగున్న కూడా థియేటర్స్ దొరకవు. అలాంటపుడు మరో మంచి డేట్ చూసుకుని రావడం మంచిదని టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.