పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు తెచ్చుకొని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు ప్రియదర్శి . ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశంతో వి,విమర్శకుల మెప్పు పొందారు దర్శి. బలగం చిత్రంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించాడు.
ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో “డార్లింగ్” అనే చిత్రంలో నభా నటేశ్ తో కలిసి నటిస్తున్నాడు ఈ హీరో. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి స్పందన రాబట్టి, చిత్రంఫై అంచనాలను పెంచింది. కాగా డార్లింగ్ చిత్ర నిర్మాత ఈ చిత్ర కథపై నమ్మకంతో డేరింగ్ స్టెప్ వేయబోతున్నారు. రిలీజ్ కంటే ఒక రోజు ముందుగా పెయిడ్ ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ లోని మూసాపేట్ లోని శ్రీ రాములు బిగ్ స్క్రీన్ థియేటర్ లో జులై 18న సాయంత్రం 6:30 గంటలకు డార్లింగ్ ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోకు చిత్ర యూనిట్ పాల్గొంటుంది. ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ప్రీమియర్ షోల ట్రెండ్ నడుస్తుంది. టాక్ బాగుంటే మౌత్ టాక్ తో రిలీజ్ రోజు కాసిన్ని ఎక్కువ టిక్కెట్లు తెగుతాయి. కానీ తేడా కొడితే మాత్రం పోస్టర్ ఖర్చులకు కూడా రావు. డార్లింగ్ పై చాల నమ్మకంగా ఉన్నారు టీమ్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి డార్లింగ్ చిత్రాన్నీ నిర్మించారు. కాగా డార్లింగ్ ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : War -2 Update: హైదరాబాద్ లో ఎన్టీఆర్–హృతిక్‌ల వార్-2..ఎప్పటినుండంటే..?