RRR తర్వాత జూ. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే వార్ -2 చిత్రాన్ని మొదలు పేట్టాడు తారక్. 2019లో విడుదలైన ‘వార్’ కి సీక్వెల్‌గా రాబితోంది ‘వార్ 2’ . ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు ఎన్టీయార్. హృతిక్ రోషన్, తారక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఇప్పటివరకు ముంబై, గోవాతో పాటు విదేశాల్లో కొంత భాగం తెరకెక్కించారు. ముంబై షెడ్యూల్‌లో ఎన్టీఆర్–హృతిక్ ల మధ్య యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. కాగా వార్ -2 సంభందించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందనేది వార్త సారాంశం. ఇది వాస్తవమేనని వార్ -2 కోసం హైదరాబాద్ లో భారీ బడ్జెట్ తో సెట్స్ డిజైన్ చేస్తున్నారని టాక్ . ఆగష్టు నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభంకానుందని తారక్, హృతిక్ ఇద్దరు ఈ సెట్ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని యూనిట్ సభ్యుల నుండి సమాచారం. కాగా ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న వార్ -2 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు నిర్మాణ సంస్థ ఇది వరకే తెలిపింది. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ సంస్థఅయిన యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది.
Also Read : Kalki : బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు ..అతడే ప్రభాస్ రాజు ..