యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ యొనటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్లకు పైగా వసూలు చేసింది. పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ సినిమాగా నిలిచింది.
Also Read : Kannappa : ‘కన్నప్ప’లో శివుడిగా నటించేందుకు నో చెప్పిన స్టార్ హీరో ఇతడే.!
ఇక మంగళవారం 8వ రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ ఏకాంగా రూ. 15 కోట్లు కొల్లగొట్టి రూ. 218 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. అటు ఓవర్సీస్ లోను ఈ చిత్రం దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో 2. 5 రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ మార్క్ కు చేరుకుని USAలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వినోదాత్మక కథాంశంతో, అనిల్ రావిపూడి యొక్క ట్రేడ్‌మార్క్ వినోదభరితమైన కథనం మరియు వెంకటేష్ యొక్క ఆకర్షణీయమైన నటనతో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం సునామి ఇప్పట్లో ఆగేలా లేదని రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొడుతూ ఫైనల్ రన్ లో రూ. 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య కేంద్రాల్లో నాన్ బాహుబలి రెకార్డులను సెట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం.