పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిజ జీవిత యోధుడు వీరమల్లు జీవిత కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సహా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతుండగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు పాటలు విశేషంగా ఆకట్టుకోగా తాజాగా మూడో పాట విడుదల చేశారు.
Also Read: Thug Life : ‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కమల్..!
అసుర హననం అంటూ సాగిన ఈ సాంగ్ అనుకున్నట్టుగానే మంచి పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. కీరవాణి ఇచ్చిన ట్యూన్ సహా రాంబాబు గోసల సాహిత్యం స్టన్నింగ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం ప్లే బ్యాక్ సింగర్స్ తోనే పాడించిన, ఈ పాట వింటుంటే ఒళ్ళు నిక్కబొడుచుకుంటుంది. అంతే కాదు ఈ లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా బాగున్నాయి. పవన్ పై పలు పోరాట సన్నివేశాల దృశ్యాలు ఒక్కోక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మొత్తానికి రెండు సింపుల్ సాంగ్స్ తర్వాత మంచి పవర్ సాంగ్‌ని మేకర్స్ ఇపుడు విడుదల చేసారు. ఇక ఈ చిత్రం ఈ జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కాబోతుంది.