Telugu Films This Week on 9th Febraury 2024: తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే సంక్రాంతి సీజన్ ముగిసింది.. అయితే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు. బాలీవుడ్ నుంచి ఫైటర్, మలయాళం నుంచి మోహన్ లాల్ మలైకోట్టై వాలీబన్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగు వెర్షన్ మాత్రం ముందు ప్రకటించినట్టు రిలీజ్ కాలేదు. ఇక ఈ వారం మాత్రం ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే దాదాపు రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలు చిన్న సినిమాలే కావడం గమనార్హం. ఈ అన్ని సినిమాల్లో కాస్త క్రేజ్ ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. నేషనల్ అవార్డు అందుకున్న కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ హీరోగా నటిస్తూ ఉండడం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తూ ఉండడంతో పాటు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా కాకుండా నరేష్ అగస్త్య హీరోగా కిస్మత్ అనే ఒక క్రైమ్ కామెడీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. అలాగే బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా బూట్ కట్ బాలరాజు అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే రథం సినిమాతో హీరోగా పరిచయమైన గీతానంద్ హీరోగా గేమ్ ఆన్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇక గ్యాంగ్ స్టర్ గంగరాజు ఫేమ్ లక్ష్ హీరోగా చదలవాడ బ్రదర్స్ నిర్మించిన ధీర అనే సినిమా రిలీజ్ అవుతుంది. చెప్పాలని ఉంది అనే సినిమాతో హీరోగా పరిచయమైన యష్ పూరి హీరోగా హ్యాపీ ఎండింగ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఇవి కాకుండా యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కించిన చిక్లెట్స్, ఫ్లోరైడ్ సమస్యల మీద తెరకెక్కించిన మెకానిక్ సినిమాలతో పాటు ఉర్వి అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాలలో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.