Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ కొత్త రచ్చ మొదలైంది. దశాబ్దాలుగా సామాన్యుడికి సినిమాను చేరువ చేస్తూ, టాలీవుడ్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ‘సింగిల్ స్క్రీన్’ థియేటర్ల మనుగడ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. రోజుల తరబడి థియేటర్ల నిర్వహణ భారంగా మారుతుండటంతో, తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరుగా టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు ఒక సంచలన విజ్ఞప్తి చేసింది. పాత అద్దె విధానానికి స్వస్తి పలికి, తక్షణమే ‘పర్సంటేజ్ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో థియేటర్లు మూసుకోవడం తప్ప వేరే దారి లేదని తేల్చి చెప్పారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు లేదా నిర్మాతలు అద్దె వసూలు చేసే విధానం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యజమానులకు ఉరితాడులా మారింది. సినిమా ఫ్లాప్ అయినా, థియేటర్ నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, అద్దెలు కట్టుకోలేక యజమానులు అప్పుల పాలవుతున్నారు. లాభనష్టాలను సమానంగా పంచుకునే ‘పర్సంటేజ్ విధానం’ అయితేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
పెద్ద సినిమాలకే ఎందుకంత పంతం?**
ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న, టైర్-2 సినిమాలకు నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అంగీకరిస్తున్నారు. కానీ, పండుగ సీజన్లలో వచ్చే స్టార్ హీరోల సినిమాలకు (మిగిలిన 10 వారాలు) మాత్రం కచ్చితంగా అద్దె కట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విధానం మార్చుకోవాలని, ఏడాది పొడవునా పర్సంటేజ్ సిస్టమ్ నే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఒకప్పుడు వంద రోజులు, యాభై రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు లేవు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘ఎఫ్ 2’ (F2) లాంటి సినిమా 8 వారాల పాటు థియేటర్లలో సందడి చేసింది. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమా చూసేస్తున్నారు. దీంతో ‘ధురంధర్’ లాంటి భారీ అంచనాల సినిమాలు సైతం కేవలం రెండు, మూడు వారాలకే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో భారీ అద్దెలు కట్టడం ఏ రకంగా న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
మల్టీప్లెక్స్ లకు ఒక న్యాయం.. మాకో న్యాయమా?
బడా కార్పొరేట్ సంస్థలు నడిపే మల్టీప్లెక్స్ లకు నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు కానీ అదే స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న సింగిల్ స్క్రీన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాకు పక్క రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ విధానం అమలు చేశారు. కానీ మన సొంత తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జిబిటర్లకు ఆ అవకాశం దక్కకపోవడం శోచనీయం. కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత అద్దె విధానాన్ని మోయడం ఎగ్జిబిటర్ల వల్ల కావడం లేదు. పర్సంటేజ్ సిస్టమ్ వైపు అడుగులు వేయడం పరిశ్రమకు ఒక సహజమైన, అవసరమైన పరిణామం అని ఎగ్జిబిటర్ల సంఘం చెబుతోంది. రిస్క్, రివార్డ్ రెండింటినీ సమానంగా పంచుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని, సింగిల్ స్క్రీన్ మ్యాజిక్ ను కాపాడుకోవడానికి స్టార్ హీరోలు, నిర్మాతలు పెద్ద మనసుతో తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం కోరుతోంది.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!