మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం మహరాజ. యువ దర్శకుడు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడు.
Also Read :OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పదం చేసుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన మహారాజ సూపర్ హిట్ సాధించి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నైలో వంద రోజుల వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథి జయం రవి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో తమకు ఇంతటి భారీ విజయుణ్ణి అందించిన దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ కు భారీ కనుక అందించారు నిర్మాతలు. అత్యంత ఖరీదైన BMW కారును చిత్ర హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు అందించారు, సినిమా ప్లాప్ అయిన సరే నిర్మాతలను వేధించే హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించి రియల్ లైఫ్ లో కూడా మహారాజా అనిపించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.