నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈ అమ్మడు తెలుగులో ఎంతో సెన్సేషన్‌గా మారింది. ప్రతి చిత్రంతో మరింత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ పోతోంది. సాయిపల్లవి ఒక మూవీలో నటిస్తోంది అంటే చాలు మినిమమ్ హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే థియేటర్లలో ఆమె కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది వాస్తవం. అందుకే లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా అందుకుంది.ఇందులో భాగంగా తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా సాయి పల్లవి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది..
Also Read: Spirit : ఏం చేద్దామనుకుంటున్నారయ్యా.. ప్రభాస్ vs సూపర్‌స్టార్
తమన్నా ప్రజంట్ ‘ఓదెల 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంపత్ నంది దర్శకత్వపర్యవేక్షణలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు, నిర్మాణం, దర్శకత్వపర్యవేక్షణ బాధ్యతల్ని సంపత్ నంది నిర్వహించారు. ఈ నెల 18న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ఈ మూవీ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది తమన్నా. ఇందులో భాగంగా తాజాగా ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ‘ఇష్టం అయిన హీరోయిన్ ఎవరు’ అని ప్రశ్కించడంతో తమన్నా బదులిస్తూ.. ‘ఐ లవ్ సాయిపల్లవి.. చాలా అందంగా ఉంటుంది. ఆమె స్పెస్ లో ఆమె ఇండివిజువల్‌గా ఉంటుంది. యాక్టింగ్ డాన్స్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు. యూనిక్ గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.