ప్రభాస్ నటించనున్న వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగా తెరకెక్కించబోతున్న ఈ మూవీ పై హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నా ఈ సినిమా అప్‌డేట్స్ గురించే అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ సూపర్ కాప్‌గా కనిపిచబోతున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఈ తరహా పోలిస్ కథ రాలేదని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Also Read: Chiranjeevi : ఉదయం లేవగానే చిరంజీవి ఎవరి ముఖం చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు..
అయితే ఈ మధ్య బారీ చిత్రాలో విలన్ పాత్ర స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం స్టార్ హీరోలను సైతం విలన్‌లుగా మార్చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో కూడా అదే ప్లాన్ చేశారట. సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడనేది దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఐడియాలజీ.. ఇక ‘స్పిరిట్’ విషయంలో సందీప్ కూడా అదే ఫాలో అవుతున్నాడట. ఇప్పటివరకు ఎవరూ ఊహించిన విధంగా ప్రభాస్‌కి ప్రత్యర్థిగా ఓ సూపర్‌స్టార్ హీరోని తీసుకొస్తున్నాడట. ఆయనెవరో కాదు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. ఈ మూవీలో ఆయన పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.