Tamannaah : ఈడీ విచారణకు సినీ నటి తమన్నా..
- ఈడీ విచారణకు ప్రముఖ నటి తమన్నా
- 'HPZ టోకెన్' అప్లికేషన్ కు సంబంధించి తమన్నాను విచారించిన ఈడీ
- 'HPZ యాప్ ను ప్రమోట్ చేసిన తమన్నా
ప్రముఖ సినీ నటి తమన్నా చిక్కులో పడింది.హెచ్‌పీజెడ్ ( HPZ ) టోకెన్ మొబైల్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను HPZ టోకెన్ మొబైల్ యాప్ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ యాప్ నిర్వాహకాన్నీతేల్చే పనిలో ఉంది. HPZ టోకెన్ మొబైల్ యాప్ కు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఈడీ ప్రశ్నిస్తోంది.
Also Read : UnstoppableWithNBK : అన్ స్టాపబుల్ షోలో తమిళ స్టార్ హీరో..
Also Read
- Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
- OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
- Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
- Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం
అందులో భాగంగానే ప్రముఖ నటి తమన్నాను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. ఈడీ అధికారులు తమన్నా నుండి వాంగ్మూలం సేకరించారు. HPZ టోకెన్ మొబైల్ యాప్ లో ఎవరైనా రూ. 57వేల పెట్టుబడి పెడితే మూడునెలల పాటు రోజుకు రూ.4వేల రూపాయలు తిరిగి ఇస్తామని నిర్వాహకులు భారీ ఈవెంట్స్ వంటివి పెట్టి కస్టమర్స్ ను నమ్మించారు. అలా ఈ అప్లికేషన్ కు సంబంధించిన ఓ ఈవెంట్ కు తమన్నా హాజరయి యాప్ ను ప్రమోట్ చేసింది. దీంతో ఈ యాప్ లో భారీగా డబ్బులు పెట్టారు. అలా నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి ఒక నెల డబ్బులు చెల్లించి నమ్మకం కలిగేలా చేసి ఆ తర్వాత నెల నుండి ఏవో సాకులు చెప్తూ డబ్బులు చెల్లించడం ఆపేసారు. నిందితులు పెట్టుబడిదారులను మోసం చేసేందుకు ‘హెచ్‌పీజెడ్ టోకెన్’ మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈడీ దాడులు నిర్వహించి రూ.455కోట్ల విలువైన స్థిరాస్తులు, డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నది.
తాజావార్తలు
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!