ఆరు పదుల వయసులో వరుస సినిమాలు, టాక్ షోస్ తో నందమూరి బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలలు తో అన్‌స్టాపబుల్’ స్టార్ అఫ్ టాలీవుడ్ అని ప్రేక్షకులతో జేజేలు పలికించుకుంటున్నారు. ఇక ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ఈ నందమూరి హీరో. బాలయ్యలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ టాక్ షో. అటు వ్యూస్ పరంగాను అన్‌స్టాపబుల్’ టాక్‌షో రికార్డులు క్రియేట్ చేసింది.
Also Read : Priya Bhavani Shankar : ఆ సినిమా హిట్ తో ప్రశాంతంగా నిద్రపోయాను..
తాజాగా అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 ద్వారా మరోసారి తన అభిమానులని, ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అటు అభిమానులు కూడా ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లోని మొదటి రెండు ఎపిసోడ్స్ ఫినిష్ చేసారు మేకర్స్. ఫస్ట్ గెస్ట్ గా మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు ఆయన నటించిన లక్కీ భాస్కర్ టీమ్ హాజరయింది. ఇక రెండవ ఎపిసోడ్ కోసం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఈ టాక్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసారు ఆహా యూనిట్. ఈ నెల 24 ఆ ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారు. సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్ రాజా తో సహా టోటల్ టీమ్ పాల్గొంటుంది. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.