బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆమె వెనుకాడదు. ఆమె ఏం అనుకున్నా కూడా మొహం మీదే కుండబద్దలు కొడుతుంది. తాజాగా ఓ రేప్ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పుపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లేదా బలవంతంగా లైంగిక సంబంధం లేదా భర్త చేసిన లైంగిక చర్య అత్యాచారం కాదని కోర్టు విచారణలో తేల్చింది.
“ఇది మాత్రమే మిగిలింది ఇప్పుడు వినడానికి…” అంటూ తాప్సి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది. తాప్సీ పన్నుతో పాటు ప్రముఖ గాయని సోనా మొహపాత్రా కూడా సోషల్ మీడియాలో తన కోపాన్ని వ్యక్తం చేసింది.
Read Also : అమితాబ్ బాడీ గార్డ్ జీతం ఎంతో తెలుసా ?
ఈ కేసు విషయానికొస్తే… జస్టిస్ ఎన్‌కె చంద్రవంశీ గురువారం ఒక మహిళ, ఆమె కుటుంబంలోని ఇద్దరు సభ్యులపై నమోదైన కేసుపై తీర్పును ప్రకటించారు. ఇందులో నిందితులపై అత్యాచారం, ఇతర నేరాలను రద్దు చేయాలని ఆదేశించింది. 2017 సంవత్సరంలో బాధితురాలు రాయ్‌పూర్‌లోని చంగోరభటలో నివసిస్తున్న ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు ఇద్దరు కట్నం కోసం మహిళను హింసించడం ప్రారంభించారు. ఈ క్రమంలో భర్త ఆమెపై అత్యాచారానికి పాల్పడడం, లైంగికంగా, మానసికంగా వేధించడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు కుటుంబంలోని మరో ఇద్దరిపై ఫిర్యాదు చేసింది.
Bas ab yehi sunna baaki tha . https://t.co/K2ynAG5iP6
— taapsee pannu (@taapsee) August 26, 2021