Taapsi Pannu: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటుంది. నిర్మొహమాటంగా తనపైకి వచ్చినవారికి అంతే రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే బ్యూటీ బ్యాడ్ లక్ మాత్రం తెలుగు సినిమా కెరీర్‌ని మరో వైపు తీసుకెళ్తుంది. ప్రభాస్, రవితేజ, గోపీచంద్ లాంటి మాస్ హీరోలతో డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసింది. కానీ అవి విజయవంతం కాలేదు. ముఖ్యంగా సాహసం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలు చేసింది. ఎప్పుడైతే బాలీవుడ్‌కి వెళ్లిందో.. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. మొదట్లో కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్.. ఇతర హీరోల చిత్రాలలో విభిన్న పాత్రలలో కనిపించింది.
పింక్ సినిమా ఆమె కెరీర్‌కు మంచి ఊపునిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. రీసెంట్ గా వచ్చిన మిథాలీ రాజ్ బయోపిక్ కూడా బెడిసి కొట్టడంతో.. అమ్మడు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో మూడు బాలీవుడ్ సినిమాలు ఉండగా.. రీసెంట్ గా తప్పీకి తెలుగు నుంచి రెండు ఆఫర్లు వచ్చాయట. తన డేట్స్ ప్రకారం ఓ సినిమా చేసి మళ్లీ తెలుగులో బిజీ కావాలనుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి కూడా ఆఫర్ వచ్చిందని టాక్. తాజాగా రవితేజ సితారతో సినిమా చేసేందుకు కమిట్‌మెంట్ ఇచ్చాడు. బహుశా ఆ ప్రాజెక్ట్‌లో తాప్సీని హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైతేనేం చాలా కాలం తరువాత తాప్పీ మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ టాలీవుడ్ ఎంట్రీతో తాప్పీ తన అభిమానులను ఎలా మెప్పించనుందో చూడాలి మరి..
ఇక గతంలో కంగనా, తాప్సీమధ్య జరిగిన వివాదాలు చిన్నవేమి కాదు. ఇక బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తో తాప్సీ గొడవ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకానొక షో లో కరణ్ షోకు మీరు ఇప్పటివరకు ఎందుకు వెళ్లలేదు అన్న ప్రశ్నకు తాప్సీ ఘాటుగా సమాధానం చెప్పింది. బహుశా కరణ్ షోలో చెప్పుకొనేంత ఇంట్రెస్టింగ్ గా నా శృంగార జీవితం లేదేమో, అందుకే అతను నన్ను పిలవలేదు అని చెప్పుకొచ్చి అందరికి షాక్ ఇచ్చింది. తాప్సీకి కుదిరే జోడి కోసం వెతుకుతున్నాం. అలాంటి వారు దొరికన్నపుడు ఖచ్చితంగా పిలిస్తాను. అప్పుడు కనుక ఆమె రాకపోతే నేను చాలా బాధపడతాను” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పటివరకు తాప్సీ శృంగార విషయాలను పంచుకొనే వ్యక్తి దొరకలేదు.. అందుకే పిలవలేదు అని బాహాటంగానే చెప్పాడు. అణుడిలో ఆమె చెప్పిన దానికి కౌంటర్ వేశాడు కరణ్ జోహార్.
Hijab Row: హిజాబ్ అంశంపై సుప్రీం అస్పష్ట తీర్పు.. విస్తృత ధర్మాసనానికి బదిలీ!