Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నుంచి విడుదలైన ‘బాస్ పార్టీ..’ పాట ఇన్ స్టెంట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో టిక్ టాక్స్ విపరీతంగా చలామణిలో ఉన్నాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరగటం టీమ్ కు కూడా ఎంతో కిక్కిచ్చింది. ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు మైక్రో బ్లాగింగ్ సైట్స్ లో మారుమ్రోగుతున్న ఈ పాటకు మెగాస్టార్ మనవరాలు కూడా చిందేసింది.
సుస్మిత కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ లో ‘బాస్ పార్టీ…’ పాట కోసం శేఖర్ మాస్టర్‌తో కలసి తన కుమార్తె కాలు కదిపిన వీడియోను షేర్ చేసింది. మంచు వర్షం బ్యాక్ డ్రాప్ లో వీరిద్దరూ ‘బాస్ పార్టీ’ పాటకి అనుగుణంగా చిందేశారు. ప్రస్తుతం ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకి సంబంధించిన కొత్త పాటను ఫ్రాన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను శృతి హాసన్, చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్ళిన చిరంజీవి తనతో పాటు ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళిన విషయాన్ని ఇంతకు ముందే షేర్ చేశారు. చిరు మనవరాలు కూడా అక్కడే తన తాత పాటకు శేఖర్ మాస్టర్ తో కలసి డాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకు కేఎస్ రవీంద్ర దర్శకుడు. ఈ సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sushmita Konidela: ‘బాస్ పార్టీ’ పాటకి చిరు మనవరాలి చిందు