కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రాలో మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్ ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీ 1980ల కాలాన్ని బ్యాక్‌డ్రాప్‌గా చేసుకొని రూపొందిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మే 1న తెలుగుతో పాటు తమిళ భాషలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, సాంగ్స్, గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబట్టాయి. దీంతో ‘రెట్రో’ పై ఆడియన్స్ అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా సూర్య, పూజా హెగ్డే కాంబినేషన్ చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారికంగా ప్రకటించారు..
Also Read: AlluArjun : మార్క్ శంకర్‌ను పరామర్శించిన అల్లు అర్జున్..
కాగా ఈ మూవీకి సంబంధించిన అవైటెడ్ ట్రైలర్ ఏప్రిల్ 18న రిలీజ్ అంటు సూర్య ఇంకా పూజ పోస్టర్ తో పోస్ట్ పెట్టారు. అంతే కాదు ట్రైలర్‌తో పాటుగా ఆడియో లాంచ్ కూడా చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. తమిళ నాట గ్రాండ్‌గా ఆడియెన్స్ ఫంక్షన్ చేస్తుండగా అదే రోజున సాయంత్రం ట్రైలర్ రానుంది. మరిక ఏ టైం కి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Love and laughter will conquer any war 🤍#Retro – Audio & Trailer from 18-04-2025 ⚔️#LoveLaughterWar #RetroFromMay1 #TheOne 🔥@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian @kaarthekeyens @kshreyaas @cheps911… pic.twitter.com/XlgGZ2jadN
— 2D Entertainment (@2D_ENTPVTLTD) April 14, 2025