రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇక గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్‌ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు పవన్ దంపతులు. దీంతో ఒక్కొక్కరుగా వెళ్లి మార్క్ ను పరామర్శించి వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ దంపతులు కూడా వెళ్లారు.
ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొన్ని, జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. అలా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు గడిపినట్లు సమాచారం. అయితే చాలా రోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పైకి అందరూ కలిసి బాగానే ఉన్నట్లు కన్నిప్పిస్తున్నప్పటికి, లోలోపల మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు గట్టిగా సాగుతున్నట్టు సమాచారం. పుష్ప-2 సినిమా తో బన్నీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగా హీరోలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయనప్పుడు కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉంది. ముఖ్యంగా మొన్న పుట్టిన రోజుల సందర్భంగా కూడా ఎవ్వరు విషెస్ చెప్పకపోవడంతో ఈ వార్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతన్ని కుమారుడిని పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది.