కోలివుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 1 న విడుదలైంది. రిలీజ్ కు ముందు రెట్రో పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా సూర్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు కాబట్టి.. అతను సూర్యకు గ్యారెంటీగా హిట్ ఇస్తాడు అని భావించారు. ఇక టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ కూడా మంచి హిట్ రాబోతోందని ఫిక్స్ అయ్యారు. భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన రెట్రోకు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది.
Also Read: Khushi Kapoor : బికినీలో అక్కను మించిన ఎక్స్పోజింగ్ తో రెచ్చిపోయిన ఖుషీ కపూర్..
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఏ దశలోనూ మెప్పించలేకపోయాడు అంటూ. ముఖ్యంగా సెకండ్ హాప్ లో అయితే సెల్వరాఘవన్ రూపొందించిన యుగానికి ఒక్కడు ఫార్మాట్‌ను ఫాలో అయ్యాడని అని అదే సినిమాకు మేజర్ మైనస్ అయింది అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ నటన పరంగా సూర్య అదరగొట్టాడు. పూజా హెగ్డే కూడా ఫస్ట్ టైమ్ డీ గ్లామర్ రోల్ లో మెప్పించింది. పైగా ప్రీ క్లైమాక్స్ వరకు కనిపించిన ఫాదర్ సన్ కాన్ ఫ్లిక్ట్ క్లైమాక్స్ లో తేలిపోవడం.. కొత్త ‘ఫాదర్’ రావడం.. ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులకు మతిపోగొట్టాయి. అయినా సూర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోయినా, తమిళనాడులో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. 100 కోట్ల రూపాయల వసూళ్లు తమిళనాట అందుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ పై వార్తలు వినపడుతున్నాయి. రెట్రో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా. జూన్ 5 నుంచి స్ట్రీమ్ చేయబోతున్నట్లు సమాచారం.