Surekha Vani : సీనియర్ నటి సురేఖ వాణి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. వివాదాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ఆమె కూతురు సుప్రీత నాయుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. ఈ మూవీ టైటిల్ గ్లిప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈవెంట్ కు సురేఖ వాణి కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ల పొట్టి బట్టలపై ప్రశ్న ఎదురైంది.
Read Also : Adavi Shesh : అడివి శేష్ ‘డకాయిట్’ నుంచి ఫైర్ థీమ్ రిలీజ్
కురచ బట్టలు వేసుకోవడంపై కొందరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంటారు. మీకు అలాంటివి ఏమైనా ఎదురయ్యాయా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దానిపై సురేఖవాణి స్పందిస్తూ.. అందరి ఆలోచన ఒక విధంగా ఉండదు కదా. ఒక్కొక్కరి బుర్ర ఒక్కోలా ఉంటుంది. దానికి మనం ఏమీ చేయలేం. వాడు ఏదో ఆలోచించుకుని ఒక కామెంట్ చేస్తాడు. నేను, నా కూతురు మొదట్లో మా రీల్స్ కు ఇలాంటి కామెంట్లు వస్తే మొదట్లో రియాక్ట్ అయ్యేవాళ్లం. కానీ ఆ తర్వాత చూసి నవ్వుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది సురేఖవాణి.
Read Also : HHVM : ’వీరమల్లు’ పోస్ట్ పోన్ అవుతుందా.. ఏంటీ ప్రచారం..?