HHVM : ’వీరమల్లు’ పోస్ట్ పోన్ అవుతుందా.. ఏంటీ ప్రచారం..?
- వీరమల్లుపై నెగెటివ్ ప్రచారం
- స్పందించని టీమ్
- ఇంకా పెండింగ్ వర్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం.. హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. అధికారికంగా ఎలాంటి హింట్ లేదు. కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది. అయినా ఒక్క ప్రమోషన్ జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్డేట్లు లేవు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ స్థాయిలో హంగామా ఉండాలి. కానీ హడావిడి లేకుండా డల్ గా ఉంది సిచ్యువేషన్.
Read Also : Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అనౌన్స్ చేయలేదు. ట్రైలర్ కూడా రాలేదు. కొత్త పోస్టర్లు రావట్లేదు. రీసెంట్ గా నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. ఇంకా పెండింగ్ వర్క్ ఉందని.. అది అయిపోయాక ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ లో పెండింగ్ వర్క్ ఉండటం అంటే ఒకింత ఫ్యాన్స్ దృష్టిలో పోస్ట్ పోన్ పడుద్దేమో అనే ప్రచారానికి తెర తీసింది. ఈ విషయాలన్నింటినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరిస్తూ ప్రచారం మొదలు పెట్టారు. జులై నెలకు పోస్ట్ పోన్ అవుద్దేమో అంటున్నారు. ఇది రాను రాను మరింత పెరుగుతోంది.
దీనిపై మూవీ టీమ్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే బెటర్. లేదంటే మూవీ హైప్ మీద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. అసలే ఐదేళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. మే నెలలో రిలీజ్ అనుకున్నా.. చివరకు జూన్ 12కు వాయిదా పడింది. ఇప్పుడు అది కూడా వాయిదా పడితే ఫ్యాన్స్ ను ఘోరంగా హర్ట్ చేసినట్టే. పెండింగ్ పనులు ఉంచుకుని రిలీజ్ డేట్ ఎందుకు ఇచ్చారంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఫ్యాన్స్ ఆందోళన నిజమయ్యేలాగానే ఉంది. కానీ చివరి ఐదు రోజుల్లో ప్రచారం మొదలు పెట్టినా పవన్ క్రేజ్ కు మూవీ హైప్ పెరుగుతుందనే నమ్మకం యూనిట్ లో ఉంది. మరి నిజంగానే వాయిదా వేస్తారా లేదంటే అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.
Read Also : Thuglife : థగ్ లైఫ్ ను కర్ణాటకలో రిలీజ్ చేయను.. కమల్ సంచలనం..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!