Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Movie : ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘రామాయణ’ సినిమాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ మూవీలో ఇతిహాస వాస్తవాలను పూర్తిగా వక్రీకరించారంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు, ఈ సందర్భంగా పిటిషనర్ తీరుపై ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇతిహాసమైన రామాయణంలోని వాస్తవాలను సినిమాలో తప్పుగా చూపించారంటూ ఓ వ్యక్తి ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు.
అయితే, ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. సినిమా నిర్మాతలు తమ అవగాహన, సృజనాత్మక స్వేచ్ఛకు అనుగుణంగానే ఈ సినిమాను రూపొందించారని వ్యాఖ్యానించింది. రామాయణంపై పిటిషనర్‌కు విభిన్న అభిప్రాయాలు ఉంటే, ఆయనే సొంతంగా నచ్చినట్లు సినిమాను నిర్మించుకోవచ్చని సూచించింది. ఇలాంటి పిటిషన్లతో న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది. ఇకపోతే, ఒకవైపు న్యాయపరమైన వివాదాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.
Also Read
ఇక కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా ఈ మూవీకి క్రేజ్ మాత్రం తగ్గలేదన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుందని టాక్. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ‘ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి “సుప్రీంకోర్టు తీర్పుతో ‘రామాయణ’ చిత్ర బృందానికి పెద్ద ఊరట లభించినట్లయింది”. ప్రస్తుతం ‘రామాయణ పార్ట్ 2’ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ గురించి కీలక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
AP Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి పెట్టుబడుల జాతర.. పలు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
-
Nagarjuna : డ్రగ్స్ రహిత భారత్‌కు హీరో నాగార్జున మద్దతు
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
ట్రెండింగ్
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..