ఉగాది రోజున నరేశ్, అలీ నటిస్తున్న ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమాకు శుభాశీస్సులు అందచేశారు సూపర్ స్టార్ కృష్ణ. మలయాళ హిట్ ‘వికృతి’కి రీమేక్‌గా వస్తోంది ఈ చిత్రం. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే వారి వల్ల అమాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తియింది. ఉగాది రోజున ‘అందరూ…