ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ అంటే రక్తపాతం, మితి మీరిన లస్ట్, అవసరం లేని యాక్షన్ సీన్స్. ప్రజంట్ ఇలాంటివే ట్రెండ్ అవుతున్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసే విధంగా దర్శకుడు సన్నీ సంజయ్ ‘అనగనగా’ మూవీ రూపొందించారు. సమాజంలో విద్య బోధనపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్ వేస్తూ..తీసిన సినిమానే ఈ ‘అనగనగా’ . ముఖ్యంగా హీరో అక్కినేని సుమంత్ యాక్టింగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.
Also Read : NTR Birthday : తారక్ బర్త్ డే సందర్భంగా.. మోత మోగిపోతున్న సోషల్ మీడియా
కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని థియేటర్‌లోకి తీసుకు రాకుండా నేరుగా ఓటీటీలోకి వదిలారు. థియేటర్లో విడుదల అయితే కమర్షియల్‌గా ఏ మాత్రం సక్సెస్ అయ్యేదో గానీ.. ఓటీటీలో మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రశంసలను దక్కించుకుంటోంది. ఇంటిల్లిపాది హాయిగా చూసుకునేలా ఉందంటూ టాక్ వచ్చేసింది. దీంతో అందరూ ఈ మూవీ చూసేందుకు ఇష్టం పడుతుండటంతో తాజాగా వంద మిలియన్ ప్లేస్.. స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుందట. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ఒక పోస్టర్ కూడా వదిలింది.