Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sumanth Commented On Sita Ramam

Sumanth: ‘సీతారామం’ పాలిట విలన్ అతనేనా!

Published Date :August 4, 2022 , 11:20 am
By NTV WebDesk
Sumanth: ‘సీతారామం’ పాలిట విలన్ అతనేనా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దుల్కర్ సల్మాన్, మృణాళ్‌ ఠాగూర్, రశ్మిక మందణ్ణ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘సీతారామం’. శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం జరిగింది. దీనికి ‘డార్లింగ్’ ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మూవీపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ‘సీతారామం’ మూవీలో సుమంత్‌ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే సుమంత్ ఇంతవరకూ హీరోగా తప్పితే ఇలా కీలక పాత్రలు పోషించిందే లేదు. రవిబాబు ‘సోగ్గాడు’లో అతిథి పాత్రలో మెరిసిన సుమంత్‌, ఎన్టీయార్ బయోపిక్ మూవీస్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’లో తన తాతయ్య అక్కినేనిగా కాసేపు తెర మీద కనిపించారు. అయితే తొలిసారి ‘సీతారామం’లో బ్రిగేడియర్ విష్ణుశర్మగా సుమంత్‌ కీలక పాత్ర పోషించారు. అతని భార్యగా భూమిక నటించారు.

read also: Kolanapaka-Bachannapet: వాగు ఉధృతికి స్కూటీతో కొట్టుపోయిన టీచర్‌..! ఏం జరిగిందంటే..?

Also Read

  • NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
  • Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
  • OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్‌లో ఎవరు టాప్‌లో నిలుస్తారు?
  • Dubbing Movies : అర్థంకాని టైటిల్స్‌ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు

సుమంత్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఇంతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదని చెప్పారు. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం తన పాత్ర సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని, ప్రేక్షకులకు ఆ పాత్రతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానని అన్నారు. సుమంత్ చెబుతున్న మాటలను వింటుంటే… ఇది ఆషామాషీ పాత్ర కాదని తెలుస్తోంది. లెఫ్టినెంట్ రామ్, అతని ప్రియురాలు సీత పాలిట విలన్ లా బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్ర ఉండబోతోందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ గురించి అఫ్రీన్ అనే అమ్మాయి ఆరా తీస్తోందని తెలియగానే, విష్ణు శర్మ పాత్ర కంగారు పడటం, ఆమెను ఎలాగైనా నిలువరించాలనే ప్రయత్నం చేయడం మనం ట్రైలర్ లో చూశాం. సో… ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం తన కెరీర్ లోనే తొలిసారి సుమంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని, దాన్ని చిత్ర బృందం గోప్యంగా ఉంచిందని అంటున్నారు. హీరోగానూ డిఫరెంట్‌ కథలను ఎంపిక చేసుకుంటున్న సుమంత్‌… బ్రిగేడియర్‌ విష్ణు శర్మలోని నెగెటివ్‌ షేడ్స్ నచ్చి ‘సీతారామం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి అదే నిజమైతే…. విలన్ గా సుమంత్‌ను అక్కినేని అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఏమేరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dulquer Salmaan
  • Sita Ramam
  • Sumanth

తాజావార్తలు

  • NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..

  • OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్‌లో ఎవరు టాప్‌లో నిలుస్తారు?

  • Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?

  • Dubbing Movies : అర్థంకాని టైటిల్స్‌ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions