Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinidhi Shetty: ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న శ్రీనిధి శెట్టి.. తనకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ చేసిన సరదా, ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “అసలు ఈ ప్రాజెక్ట్ నా చేతికి ఎలా వచ్చిందో ఇప్పటికీ నా దగ్గర సరైన సమాధానం లేదు. జీవితం ఎప్పుడూ ఊహించని సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది. ఒకరోజు డైరెక్టర్ త్రివిక్రమ్ సర్ నుంచి ఫోన్ రావడం, ఈ పాత్ర నాకు దక్కడం అంతా ఓ మిరాకిల్‌లా అనిపించింది. ఆయన ఇచ్చిన ఈ రోల్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది” అంటూ చెప్పుకొచ్చారు. లెజెండరీ యాక్టర్ వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు దక్కిన గొప్ప అవకాశమని, ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేనని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
అలాగే సినిమా గురించి చెబుతూ.. “మన జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎలాగైతే ఊహించలేమో, ఈ సినిమాలోనూ ప్రతి సీన్లోనూ ఒక సరికొత్త ట్విస్ట్, సర్ప్రైజ్ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్లలో మ్యాజిక్ చేస్తుందని, అక్టోబర్ 30న కాలేజీకి సెలవు ఇచ్చేశారు కాబట్టి విద్యార్థులంతా కచ్చితంగా థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడాలని కోరారు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!