క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘పుష్ప’ తరువాత సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా వార్తల ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో చేయబోతున్నాడట. చరణ్ కు సుకుమార్ కథను కూడా వివరించాడట. చరణ్ కు సుకుమార్ రాసిన కథ నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఈ చిత్రంతో సుకుమార్ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోనున్నాడు. ఈ చిత్రంతో సుకుమార్ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోనున్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా హీరోగా మారిపోనున్నాడు. రామ్ చరణ్ తాను అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోతాడని సుకుమార్ భావించాడట. శంకర్ తో రామ్ చరణ్ సినిమా ‘ఆర్సి15’ తరువాత సుకుమార్, చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.