పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో సుకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కూడా సైలెంట్ గానే ఉన్న ఆయన తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో మాట్లాడారు. నా కెరియర్ గురించి నేను థాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. ఎందుకంటే పుష్ప మొదటి భాగం హిందీలో రిలీజ్ చేయించాలని ఆయనే ప్రయత్నించారు. అందరికీ ఫోన్లు చేయించి చివరికి రిలీజ్ చేయించి దాన్ని పెద్ద సక్సెస్ చేయించారు. ఈ రోజున నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం, అది రాజమౌళి గారే. మా సినిమా పాన్ ఇండియా సినిమా కాదని అంటే నువ్వు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే అదే పాన్ ఇండియా సినిమా అని ఆయన అన్నారు. సపరేట్గా పాన్ ఇండియా సినిమా అంటూ ఏమీ ఉండదు.
Gaza-Israel War: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆస్పత్రిలో 29 మంది మృతి
రిలీజ్ నీ బట్టే పాన్ ఇండియానా కాదా అని తెలుస్తుంది అందుకే రిలీజ్ చేయమని అన్నారు. నా టీం మొత్తాన్ని పిలిచి థాంక్స్ చెబుదాం అనుకున్నాను కానీ మా ప్రొడ్యూసర్స్ ఈసారి కూడా నాకు టైం ఇవ్వటం లేదు.. నేను ప్రతి ఫ్రేమ్ వచ్చిన ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి చేశాను. వాళ్లంతా నా లోకంలోకి వచ్చేలా ప్లాన్ చేశాను. ఈ సినిమా కోసం నేను నా టీమ్ అహర్నిశలు కష్టపడి పని చేశాము. అని అంటూ తన టీమ్ని స్టేజి మీదకు పిలిచారు. తర్వాత ఫహద్ ఫాజిల్ గురించి ప్రస్తావించడం మరిచిపోయానని ఆయన గురించి మాట్లాడారు.ఇక ఈ ప్రెస్ మీట్లో సినిమాలో కథ లేదు, లాజిక్స్ లేవు అని అన్నవారందరి విమర్శలకు ఆయన ఒకరకంగా సమాధానం ఇచ్చినట్టు అయింది.