కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్ అయింది. అసలు ఈ సినిమా క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. రిలీజ్‌కు ముందే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఏకంగా ముందే 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి. దీంతో.. ఫాస్టెస్ట్ 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది.
Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం!
మరి ఎంత క్రేజ్ ఉన్న సినిమా.. ఫస్ట్ డే ఎంత రాబడుతుంది? అంటే, ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 223 కోట్ల ఓపెనింగ్స్‌తో ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్‌లో ఉంది. బాహుబలి 2 పేరిట ఉన్న 215 కోట్లను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసింది. కానీ ఇప్పుడు పుష్పగాడి దెబ్బకు బాహుబలి 2నే కాదు.. ఆర్ఆర్ఆర్ రికార్డ్ కూడా లేచిపోయేలా ఉంది. ఎంత కాదనుకున్నా.. ఫస్ట్ డే 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్య వసూలు చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే.. ఓ రోజు ముందే ఈ సినిమా ప్రీమియర్స్ షోతో స్టార్ట్ అయింది. డిసెంబర్ 5న థియేటర్లోకి రిలీజ్ అవగా.. డిసెంబర్ 4న రాత్రి 9 గంటల 30 నిమిషాలకే పుష్పగాడి రూలింగ్ మొదలైంది. ఈ ప్రీమియర్స్ టికెట్ రేట్లు అఫీషియల్‌గా వెయ్యి ఉండగా.. అనఫీషియల్‌గా మూడు వేల వరకు ఉంది. కాబట్టి.. పుష్ప 2 ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.