నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన సినిమాలు ఎంపిక చేయాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.
Also Read : Mass Jathara : అఫీషియల్.. ఆగస్టు 27న మాస్ జాతర రిలీజ్ వాయిదా
‘రవిమోహన్ స్టూడియోస్’ పేరుతో సొంత నిర్మాణసంస్థ ను ఏర్పాటు చేసారు.అందుకు సంబంధించి నేడు చెన్నైలో భారీ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమిళ హీరోలు కార్తీ, శివకార్తికేయన్, SJ సూర్య, అథర్వ, జెనీలియా, సుధా కొంగరతో పాటు పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు. అలాగే రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించబోయే తొలి రెండు సినిమాలను కూడా ప్రకటించారు. అందులో మొదటి సినిమాలో రవి మోహన్ హీరోగా కార్తీక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. SJ సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక రెండవ సినిమాలో హాస్య నటుడు యోగిబాబు లీడ్ లో రాబోతోంది. ఈ సినిమాను స్వయంగా రవి మోహన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అటు హీరోగా ఇటు నిర్మాతగా రవి మోహన్ మొదలు పెట్టిన ఈ నూతన ప్రయత్నంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రవి మోహన్.