స్టార్ హీరోలు సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా కుమ్మేస్తున్నారు. తగ్గేదే లే అంటూ ఇటు సినిమాలు, అటు యాడ్స్‌లో రెండు చోట్లా తమ మార్క్ చూపిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్ బాబు,అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలంతా కూడా వారి చిత్రాలతో బిజీగా ఉంటూ కూడా వరుస యాడ్‌లు చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో కూడా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, సల్మన్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఇలా అందరూ ఏదో ఒక బ్రాండ్‌కి అబాజిడర్‌గా వ్యావహరిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్,షారుఖ్ ఖాన్, టైగర్ కు జైపూర్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Also Read : Yash : బాలీవుడ్ ‘రామాయణ్’ షూటింగ్ పై తాజా అప్ డేట్ !
కారణం ఏంటీ అంటే.. కొంత మంది హీరోలు ఆరోగ్యానికి హానికరమైనటువంటి వాటి యాడ్స్‌కి ధూరంగా ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్,షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్ ప్రచారం చేసిన, పాన్ మసాలా యాడ్ ద్యారా చిక్కుల్లో పడ్డారు. ఈ ప్రకటనలో ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందనే కారణంగా జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దానికి తోడు ఈ యాడ్ లో ‘దానె దానె మే కెసర్ కా దమ్’ అనే ట్యాగ్‌లైన్ వాడారు. కానీ వారు చెప్పినట్లు ఈ ఉత్పత్తిలో అసలు కేశర్ కలిపి లేదని ఆరోపించారు. మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే, వారు లేకుండానే విచారణ జరుగుతుందని, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి ఆదేశాలు ఇచ్చిందట.