టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. కానీ… కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ చేయట్లేదు.
Also Read : Thama Teaser : ఆయుష్మాన్ ‘థామా’ టీజర్.. రష్మిక రెచ్చిపోయిందిగా..
అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన ఈ భామ ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. ప్రజెంట్ కళ్యాణి తమిళ,మలయాల చిత్రాలపై చూపించే శ్రద్ధ తెలుగు సినిమాలపై చూపించట్లేదు. మొదటి సినిమా మరక్కార్ డిజాస్టర్ అయినా తరువాత చేసిన హృదయం మూవీతో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా, ఆంటోనీ, వర్షంగళక్కు శేషం లాంటి సినిమాలతో కళ్యాణికి మలయాళ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కళ్యాణి తమళ్‌లో జీని, కార్తి 29, మళయాలంలో ఫహద్ ఫాజిల్‌తో ఒడుం కుతిర చద్దాం కుతిరా, దుల్కర్ సల్మాన్‌తో వే ఫారర్ ఫిలింస్ బ్యానర్‌పై మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. హీరోయిన్‌గా మొదటి అవకాశం ఇచ్చిన టాలీవుడ్‌ని పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు అప్పట్లో కళ్యాణిని ఫ్రెష్‌గా చూసారు. కానీ ఇప్పుడు ఆ కనెక్షన్ కట్ అయ్యింది. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వాలంటే, ఒక బలమైన స్క్రిప్ట్, మంచి కంటెంట్ కావాలి. లేదంటే, కళ్యాణీ… టాలీవుడ్‌కి “హలో” చెప్పకుండా అక్కడే ఉండి పోయేలా ఉంది.