దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్‌లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు.
Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..
ఈ ఎంట్రీ సీన్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొననుందని టాక్. వీరిద్దరి పాత్రల పరిచయాన్ని ఈ సీక్వెన్స్‌లోనే రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కథ దిశను కూడా ఈ సీన్‌లోనే ప్రేక్షకులకు చూపించనున్నారని సమాచారం. విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ హుక్ అన్నిటినీ కలిపి ఈ ఎంట్రీలో హైలైట్‌గా నిలవనుందట. ఇక కథ విషయానికి వస్తే.. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులం. ఆయన రచనలు మాకు ఎంతో ఇన్‌స్పిరేషన్ ఇచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఆయన నవలల బేస్ మీదనే రూపొందించాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతున్న తెలుస్తోంది.