టాలీవుడ్ చాలా సినిమాలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత కొన్ని సినిమాలకు ఆదరణ లభించిన.. కరోనా సెకండ్ వేవ్ తో మాత్రం విడుదలకు రెడీగా వున్నా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నెలలోనే విడుదల కావల్సిన ‘లవ్‌స్టోరి’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ సినిమాలు వాయిదా పడగా.. రీసెంట్ గా ఆచార్య, నారప్ప సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సాధారణ పరిస్థితులు వచ్చాక మళ్ళీ సినిమాల జోరు కనిపించనుంది. అయితే ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఈ సినిమా చిత్రీకరణకు మరోసారి కరోనా బ్రేకులు వేసింది. ఇప్పుడు విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే రావాల్సిన సినిమాలు ఎక్కువే ఉండటంతో ఈ సినిమా వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ సినిమా దసరాకు మాత్రమే కాదు, వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా విడుదల అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. వచ్చే ఏడాది వరకు చిన్న సినిమాలతో పాటుగా, స్టార్ట్ హీరోల సినిమాలు సైతం సంక్రాంతికి వరకు విడుదలకు సిద్ధంగా వున్నాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ 2022 వేసవికి విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమాని అద్బుతమైన విజువల్ వండర్ గానే కాకుండా సెంటిమెంట్ తో కూడా దర్శకుడు రాజమౌళి అద్బుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.