Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో మొదటి వారం గీతూ జైలులో గడపగా, రెండో వారం ఆ శిక్ష శ్రీసత్యకు పడింది. దాంతో కొంతమంది ఆమె చుట్టూ చేరి కబుర్లు చెప్పడం మొదలెట్టారు. ఈ సందర్భంగా తాను కేవలం డబ్బులు కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అయితే వాటి కోసం తన వ్యక్తిత్వాన్ని కోల్పోనని శ్రీసత్య చెప్పింది. జైలులో ఉన్న శ్రీసత్యను ఓదార్చడానికి వచ్చి కీర్తి భట్ తానే డిప్రషన్ లోకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంది. దాంతో నేహా చౌదరి ఆమెను ఓదార్చి మామూలు మనిషిని చేసింది. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో కథ ఇలా ఉంటే హౌస్ లో ఇనయా రెచ్చిపోయింది. కెప్టెన్ గా రాజ్ పూర్తి స్థాయిలో అనర్హుడని, ఏ సిట్యుయేషన్ నూ అతను సమర్థవంతంగా నిర్వహించలేడని కామెంట్ చేసింది. మెజారిటీ హౌస్ మెంబర్స్ జాలితో రాజశేఖర్ ను కెప్టెన్ ఎన్నుకున్నారు తప్పితే అతని మీద నమ్మకం ఉండి కాదని ఇనయా తన మనసులో మాట బయట పెట్టేసింది.
సిసింద్రీ గేమ్ సరిగా ఆడని కారణంగా ఈ వారం లగ్జరీ బడ్జెట్ ను కేటాయించడం లేదని బిగ్ బాస్ చెప్పేశాడు. సైలెంట్ గా స్టోర్ రూమ్ కు వెళ్ళి చిన్నపాటి కునుకేసిన బాలాదిత్య వల్ల రాజశేఖర్ ఎవరు నిద్రపోతున్నారో తెలుసుకోవడానికి హౌస్ మొత్తం చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఇక నామినేషన్స్ టైమ్ లో గీతూ – సుదీప మధ్య మాటలు యుద్థం సాగింది. అలానే ఇనయా – గీతూ సైతం నామినేషన్స్ సమయంలో ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. దానికి తోడు ఇనయా దొబ్బెయ్ అని అనడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇదే రకమైన వాగ్వివాదం నేహా చౌదరికి వాసంతికి మధ్య సాగింది. మొత్తం మీద నాగార్జున ఆట గట్టిగా ఆడండి అని చెబితే, వీళ్ళంతా గట్టి నోరేసుకుని పడిపోయారు.
Bigg boss 6: ఏడు… ఎనిమిది… తొమ్మిది!