Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత
- ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్
- ఇదే టైటిల్‌తో తెరకెక్కిన మరో సినిమా
- తెరపైకి స్పిరిట్ టైటిల్ వివాదం
- ఆదుకోవాలని మహిళా రైతు నిర్మాత విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit Movie Title Dispute: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. ఇదే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కడంతో.. టైటిల్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే చిన్న చిత్రాన్ని నిర్మించిన మహిళా రైతు నిర్మాత నర్సమ్మ.. తమ సినిమా విడుదల ఆగిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, టీ-సిరీస్ సంస్థకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాము సినిమా తీసి సర్వం కోల్పోయామని, పెద్దమనసు చేసుకుని ప్రభాస్ గారు తమను ఆదుకోవాలని కోరారు.
నర్సమ్మ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఎన్నో కష్టాలు పడి, ఆస్తులు అమ్ముకుని స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా మా కల మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరి శ్రమ, ఆశలు, పెట్టుబడుల సమాహారం. సినిమా విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో లీగల్ నోటీసులు రావడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాము. టీ-సిరీస్ సంస్థ నుంచి మాకు రెండు లీగల్ నోటీసులు వచ్చాయి. స్పిరిట్ పేరుతో మా సినిమా ప్రచారం, విడుదల చేపట్టవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మా చిత్రం ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ పొందింది. స్పిరిట్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే మా సినిమా ప్రచారం జరిగింది’ అని చెప్పారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
‘మమ్మల్ని ఒకసారి సంప్రదించి ఉంటే టైటిల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ ముందస్తు చర్చలు లేకుండానే నోటీసులు పంపడం వల్ల సినిమా విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ఈ వివాదం కారణంగా మా కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సినిమా విడుదల కోసం తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. విడుదలకు డబ్బులు ఇస్తామని చెప్పినవారు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఊరిలో పరువు పోయింది. ప్రస్తుతం మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు. టైటిల్‌పై అభ్యంతరాలు ఉంటే పెద్దల సమక్షంలో చర్చించి సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. పరస్పర అవగాహనతో సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నా’ అని నిర్మాత నర్సమ్మ తెలిపారు.
ప్రభాస్‌పై అభిమానంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని నర్సమ్మ స్పష్టం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు. అవసరమైతే సినిమా టైటిల్ మార్చుకోవడానికి కూడా సిద్ధమేనని వెల్లడించారు. తమ చిత్రం విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని టీ-సిరీస్ నుంచి అధికారిక లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. సమస్యకు పరిష్కారం లభించకపోతే చివరగా తమ హక్కులను కాపాడుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నిర్మాత నర్సమ్మ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!