Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand: ఒక సినిమా రిలీజ్ కు ముందే హీరో, దర్శకుడి మధ్య మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదరడం అంటే ఆ సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనో జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి విశ్వాసమే హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది మధ్య కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘భోగి’ మూవీ రఫ్ కట్‌ను ఇటీవల శర్వానంద్ వీక్షించగా, సినిమా అవుట్‌పుట్‌పై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ సినిమాలతో మళ్లీ విజయాల బాట పట్టిన శర్వానంద్, ఇప్పుడు పూర్తి మాస్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇటీవల సినిమా రఫ్ కట్‌ను చూసిన శర్వానంద్, కథను తెరపై ఆవిష్కరించిన తీరు, యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ ట్రీట్మెంట్పై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.
ముఖ్యంగా సంపత్ నంది వర్కింగ్ స్టైల్, కథను హ్యాండిల్ చేసిన విధానం శర్వానంద్‌ను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకాకముందే దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ ఇప్పటికే అంగీకరించిన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున, వాటి అనంతరం ఈ కొత్త కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ‘భోగి’ని ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తుండగా, శర్వానంద్‌ను గతంలో ఎప్పుడూ చూడని మాస్ పాత్రలో దర్శకుడు చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఈ మూవీలో హైలెట్ గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది.
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
మొదట ఈ మూవీని ఆగస్టు 28న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉండటంతో విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టాకీ పార్ట్‌తో పాటు మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో చిత్ర బృందం నిమగ్నమై ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే హీరో నుంచి ఇంతటి నమ్మకం లభించడం ‘భోగి’పై అంచనాలను మరింత పెంచుతోంది. ఒకవైపు రఫ్ కట్కు వస్తున్న సానుకూల స్పందన, మరోవైపు శర్వానంద్ మరోసారి సంపత్ నందితో పని చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు ఈ ప్రాజెక్ట్ చుట్టూ మంచి బజ్‌ను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ‘భోగి’ థియేటర్లలో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాల్సి ఉంది.
- Tags
- cinema
- Sharwanand
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!