Sonu Sood: కరోనావైరస్ సంక్షోభం మధ్య వందలాది మంది వలసదారులకు సహాయం అందించడంలో అతను చేసిన ఆదర్శప్రాయమైన పనికి సోషల్ మీడియాలో ‘హీరో’గా ప్రశంసించింది. తనదయ కారణంగా చాలా మంది వ్యక్తులు బతికారంటూ ప్రశంసల జల్లుకురిపించారు. నువ్వే మా హీరో అంటూ కొందరు అతని పోటోపెట్టుకుని పూజించారు. మరొ కొందరైతే అతన్ని కలవడానికి సైకిల్ ప్రయాణం చేసి, ఇంటికి చేరుకుని అతన్ని చూస్తేచాలు అనుకున్నారు. అతను మా దేవుడు అంటూ పొగిడేసారు. కొందరికి ఉద్యోగాలు, మరొకొందరికి ఆర్థిక సహాయం అందించి దేవుడైన వారిలో గొప్పమనసున్న వ్యక్తి బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్. అతన్ని మనం టాలీవుడ్, బాలీవుడ్ లో ఎక్కువగా హారోగా కాకుండా విలన్ గానే మనం చూశాం. ఇక అరుంధతి అయితే అందులో నటించిన పాత్రకి అందరూ ఫిదా అయిపోయి విలన్ అంటే ఇలా ఉంటాడా అనిపించేలా తన పాత్రను పోషించాడు సోనూసూద్. బొమ్మాలి అంటూ అందులో చేసిన పాత్ర అందరిని ఆకట్టుకుంది. అయితే అది సినిమా జీవితమని నిజ జీవితంలో నువ్వు హీరోవంటూ తను చేసిన సహాయానికి అందరూ చేతులెత్తి మొక్కారు.
అయితే తాజాగా సోనూసూద్ చేసిన ఓపనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడున్నారు. డిసెంబర్13న సోనూసూద్ కదుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హ్యాండ్ రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని, రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించాడు సోనూ. అయితే ఈ వీడియో 20సెకండ్ల నిడివి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు సోనూసూద్ ను తీవ్రంగా మండిపడుతున్నారు. రైలు కదుతున్న రైలుడోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిద్శనం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవాలని అంటున్నారు. దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్ గా ఉన్న మీరు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయకూడదు అంటూ కామెంట్లె చేస్తున్నారు. మరి కొంతమంది అయితే సోనూసూద్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సోనూసూద్ పోస్ట్ చేసిన వీడియోపై స్పందించిన ముంబై రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఫుట్ బోర్డ్‌పై ప్రయాణించడం సినిమాల్లో వినోదం చేయడం ఇలాంటి స్టంట్ లు చేయడం బాగుంటుంది. కానీ నిజ జీవితంలో కాదు అంటూ హెచ్చరించింది. భద్రతా మార్గదర్శకాలను అనుసరిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు దాని వల్ల అందరికీ హ్యాపీ న్య ఇయర్ అని తెలిపారు. సోనూసూద్ వీడియోను ట్యాచ్ చేస్తూ రైల్వేపోలీసులు ఇలా స్పందించారు.
— sonu sood (@SonuSood) December 13, 2022