శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
తాజగా అమరన్ విజయవంతంగా రెండవ వారంలోకి అడుగు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల మార్క్ అందుకుంది అమరన్. విడుదలైన అన్ని భాషల్లోను అమరన్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. సెకండ్ హాలిడే వీకెండ్ ముగిసే నాటికి అమరన్ వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్లకు పైగా రాబట్టింది. వర్కింగ్ డేస్ లోను అమరన్ ఎక్కడ తగ్గకుండా స్టడీగా రాబడుతూ దూసుకెళ్తోంది. ఇక ఈ వారం తమిళ్ లో సూర్య నటించిన కంగువ మాత్రమీ ఉంది. తెలుగులోను మట్కా నుండి కాస్త పోటీ ఎదుర్కోబోతోంది. కానీ అన్ని ముఖ్యమైన సెంటర్స్ లోను అమరన్ కొనసాగనుంది.పరిస్థితి చూస్తుంటే అమరన్ తన రన్ ఇప్పట్లో ఆపేలా లేడు. లాంగ్ రన్ లో అమరన్ రూ. 300 కోట్ల మార్క్ ను అందుకుంటుంది అని ట్రెడ్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హిట్ తో శివకార్తికేయన్ కెరీర్ బిగ్గెట్ హిట్ అందుకుని స్టార్ హీరోల లిస్ట్ లో చేరుకున్నాడు.