ఒకప్పటి బాలీవుడ్ హాట్ బ్యూటి బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన ఈ అమ్మడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ ‘ఎలోన్’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. ప్రజంట్ వీరిద్దరి చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. అయితే తాజాగా వీరిని ఉద్దేశించి సింగర్ మికా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Family Tip’s : పిల్లల కారణంగా భార్య భర్తల మధ్య వచ్చే గొడవలకు..చక్కని పరిష్కారం!
మికా సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే మికా సింగ్ ఇదివరకు కూడా రెండు మూడు సార్లు బిపాసా దంపతుల గురించి వైరల్ కామెంట్స్ చేయగా, తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. మికా మాట్లాడుతూ.. ‘అప్పటివరకూ మ్యూజిక్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాకు.. నిర్మాత కావాలనిపించింది. విక్రమ్ భట్‌ను సంప్రదించి ఒక కథ రాయించుకున్న. దర్శకుడిగా భూషణ్ పటేల్‌ను ఎంపిక చేసుకున్నా. అలా ‘డేంజరస్’ అనే సిరీస్‌ను రూ.4 కోట్లలో చిత్రీకరించాలని బడ్జెట్ పెట్టుకున్నాం. కానీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన బిపాసా దంపతుల వల్ల రూ.14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. షూట్ కోసం లండన్ వెళ్లాం. అక్కడ వారిద్దరూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు. షూట్ చాలా రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. అంతేకాదు వీరిద్దరూ భార్యాభర్తలు కనుక ఈ సిరీస్ కోసం ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేస్తారనుకుంటే. ఆమె నేను ఇది చేయను, అది చేయను అంటూ కండిషన్స్ పెట్టేది. వాళ్ల ప్రవర్తన చూసి నిర్మాణ రంగంలోకి ఎందుకు వచ్చానా అనిపించిది. చాలా బాధపడ్డాను. వీళ్లు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. నిజానికి నటినటులు నిర్మాతలను దేవుళ్ల గా భావించాలి. కానీ అలా జరగడం లేదు. వాళ్లు నాడు నాకు చేసిన నష్టానికి ఈనాడు ఆ దంపతులకు ఏ పనీ లేకుండా పోయింది. ఈ రోజు వారిద్దరు ఇంట్లో కూర్చొన్నారంటే అందుకు కారణం కర్మఫలమే’ అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.