ప్రస్తుత కాలంలో బంధాలకు విలువ ఇచ్చేవారు ఎంత మంది ఉన్నారో.. వద్దు అనుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాతే చాలా మంది విడిపోతున్నారు. కారణం మా మధ్య పిల్లలు పుట్టిన తర్వాత దూరం పెరిగింది, గొడవలు జరుగుతున్నాయి అని ఎక్కువగా విడాకుల వరకు వెళుతున్నారు. అయితే, అందరికీ అలాగే జరగుది అని కాదు. కానీ పెళ్లైన కొత్తలొ ఉన్న క్లోజ్‌నెస్ రాన్రాను కాస్తా తగ్గుతుంది. పిల్లలు పుట్టాక మరింత దూరం పెరుగుతుంది. మరి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి. దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా తండ్రిగా అతనికి బాధ్యతలు పెరుగుతాయి.ఈ విషయాని భర్య అర్ధం చేసుకోవాలి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని పనిభారాన్ని పంచుకోవాలి. లేదు అంటే భర్త భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, భార్య భర్తకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అక్కడి నుంచి మొదలవుతుంది. అదే దంపతులిద్దరూ పనులు షేర్ చేసుకుని, పుట్టిన బిడ్డను ప్రేమగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది.
2. పెళ్లి అయిన కొత్తలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకుంటూ ఎలా అయితే ఉన్నారో, అలాగే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ కోసం కూడా ఇద్దరు సమానంగా టైమ్ స్పెండ్ చేయాలి. దీని వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. కొంతమంది పిల్లల పనుల కోసం మనిషిని పెడుతుంటారు. అది కూడా ఒక్కింత మంచిది పనిభారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ అలా అని పని వాళ్ళకే అస్తమానం పిల్లలు అప్పగించకుండా, సాయంత్రం వేలలో అల పిల్లలతో కలిసి వాకింగ్‌కి వెళ్లండి. దీని ద్వారా మీరు ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేయొచ్చు.
3. ప్రసవం తర్వాత మహిళల ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. నెలల పిల్లలు చాలా వరకు రాత్రి వేళలో నిద్రపోరు అలాంటప్పుడు తల్లులు వారిని పడుకోబెట్టి ఏ తెల్లవారుజామునో పడుకుంటూ ఉంటారు. సరైన నిద్ర లేకపోవడం వలన కోపం, చిరాకు మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఇది వారిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో భర్త సపోర్ట్ చాలా అవసరం. ఇలాంటి టైంలో తొందరగా లేచి ఇంటి పని చేసి భార్యకి కొంత పని తగ్గించాలి. అలాంటప్పుడు భార్య తనకున్న చిరాకు గాని,కోపం కానీ భర్త మీద చూపించదు. అలాగే భార్య లు కూడా కాస్తంత ఓపిక తెచ్చుకుని భర్తతో కోపంగా కాకుండా ప్రేమగా పనులు చేయించుకోవాలి.
4. అలాగే పెళ్ళికి ముందు ఇద్దరు కలిసి బయటకు వెళ్లడం ఉల్లాసంగా గడపడం చేస్తుంటారు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత బయటికి వెళ్లే టైమ్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే, పిల్లల్ని ప్రతిచోటకి తీసుకెళ్లలేం. ముందులా పార్టీలు, ఫంక్షన్స్‌లో టైమ్ స్పెండ్ చేయలేరు. కానీ.. పిల్లలని అమ్మమ్మ తాతయ్య దగ్గర వదిలి ఒక గంట అలా కపుల్స్ ఇద్దరు కలిసి స్పెండ్ చేసేందుకు టైమ్‌ని క్రియేట్ చేసుకోండి. వాటిని బట్టి ఈవెంట్స్ ప్లాన్ చేసుకోండి.. సరైన సమయం చూసుకుని మీరు ఇద్దరు కలిసి టైమ్ సెండ్ చేయండి. చిన్న చిన్న సంతోషాలు క్రియేట్ చేసుకోండి. ఉదాహరణకి మీ బిడ్డ నిద్రపోయిన తర్వాత కలిసి సినిమా చూడడం, ఇంటి విషయాలు మాట్లాడుకోవడం చేయండి.
5. ఒక ముద్దు.. ఒక కౌగిలింత ఇచ్చినంత మానసిక ధైర్యం మరే మెడిసిన్ కూడా ఇవ్వదు అంటారు. కానీ పిల్లలు పుట్టాక భార్య భర్తల మధ్య లైంగిక సంబంధం కూడా తగ్గుతుంది. కారణం, ఎక్కువ బిడ్డను చూసుకోవడానికే టైమ్ గడుపుతారు. మిగతా వాటిని పట్టించుకోరు. అలా ఎప్పుడు చేయొద్దు. లైంగిక సంబంధానికి సమయం కేటాయించండి. దీని వల్ల కూడా మీ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ మరింత గట్టిపడుతుంది. కనుక ఇద్దరు వీలైనంత వరకు రొమాంటిక్‌గా ఉండటం మంచిది. భయటికి వెళ్లెటప్పుడు మీ బిడ్డకు ముద్దు పెట్టినట్లు మీ భార్యకి కూడా ముద్దు పెట్టండి. అలాగే భార్య కూడా భర్త ఇంటికి రాగానే కాస్త తల నిమరడం, ఈ రోజు ఎలా ఉంది అని అడిగి ప్రేమగా ఒడిలోకి తీసుకుని మాట్లాడటం చేయండి. ఇలా చేస్తే వారికి ఒత్తిడి తగ్గుతుంది. ఇద్దరి మధ్య ఎలాంటి కోపాలు తాపాలు రావు.